Wednesday, May 15, 2024
- Advertisement -

కేసీఆర్‌కు ఉన్నంత ధైర్యం … చంద్ర‌బ‌బాబుకు ఉందా….?

- Advertisement -
KCR fires on Amit Shah.. what about Chandrababu..?

తెలంగాణాలో భాజాపాను బ‌లోపేతం చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మూడు రోజుల పాటు ప‌ర్య‌టించారు. ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లో 2019 ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన పార్టీగా ఎద‌గాల‌ని ల‌క్ష్యంతో అమిత్‌షా యాత్ర సాగుతోంది.

తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో కేంద్రం తెలంగాణ‌కు వేల కోట్లు నిధులిస్తోంద‌ని, కానీ రాష్ట్రం వాట‌న్నింటినీ మింగేస్తోంద‌ని అమిత్ ఆరోప‌ణ‌లు చేశాడు. అమీత్‌షా చేసిన వ్యాఖ్య‌ల‌పై సీఎం కేసీఆర్ ఉతికి ఆరేశారు.
ప‌లు ప‌న్నుల రూపంలో తెలంగాణ ఏటా కేంద్రానికి ఎంత మొత్తం చెల్లిస్తోందో, తిరిగి ప్ర‌తిఫ‌లంగా కేంద్రం ఎన్నినిధులు కేటాయిస్తోందో, కేంద్ర ప‌థ‌కాల‌కు ఎంత ఖ‌ర్చు పెడుతుందో లెక్క‌ల‌తో స‌హా కేసీఆర్‌ వివ‌రించిన తీరు రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచే కాదు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందుతోంది. కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధులు ఎంత‌, కానీ వాళ్లు ఇస్తున్న‌ది ఎంత అన్న‌ది ప్ర‌తిపైసాతో స‌హా అర‌టి పండు వ‌లిచి పెట్టిన‌ట్టు కేసీఆర్ వివ‌రించారు. చిల్ల‌ర రాజకీయాల కోసం అమిత్‌షా ఇష్ట‌మొచ్చిన‌ట్టు అబ‌ద్ధాలు చెప్పిపోతే మౌనంగా ఉండాలా అని ఘాటుగా ప్ర‌శ్నించారు.

{loadmodule mod_custom,Side Ad 1}

తాను చెప్పిన మాట‌ల్లో ఒక్క అక్ష‌రం త‌ప్పున్నా సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తానన్న తెగువ కేసీఆర్‌కు క‌చ్చితంగా మైలేజీ పెంచుతుంద‌ని చెప్తున్నారు. వివిధ ప‌ధ‌కాలు, కార్య‌క్ర‌మాల ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం కేటాయిస్తున్న‌ నిధులు, వాటి ఖ‌ర్చులను సామాన్య మాన‌వుడికి కూడా అర్ధ‌మ‌య్యే రీతిలో కేసీఆర్ వివ‌రించిన వైనం శ్వేత‌ప‌త్రం విడుద‌ల‌కు మించి ఉంది అని అంటున్నారు.
ఇప్పుడు అమిత్‌షాపై కేసీఆర్ మాట‌ల తూటాల‌పై ఆంధ్రాలో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ‌కు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం కేటాయిస్తున్న నిధుల‌ను అణాపైస‌ల‌తో స‌హా కేసీఆర్ వివ‌రించిన తీరుగానే ఆంధ్ర ముఖ్య‌మంత్రి కూడా లెక్క‌లు వెల్ల‌డించాల‌ని డిమాండ్ పెరుగుతోంది. ఏపీలో మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న‌ప్ప‌టికీ కేంద్ర నిధుల కేటాయింపుల విష‌యంలో బీజేపీ, తెలుగుదేశం చెప్తున్న లెక్క‌ల‌కు ఏ మాత్రం పొంత‌న లేదు. అస‌లు వాస్త‌వం ఏంట‌నేది రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియ‌క గంద‌ర‌గోళంలో ఉన్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

అమిత్ షా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అయినా చంద్ర‌బాబు చొర‌వ తీసుకుని కేంద్ర నిధుల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని కోరుతున్నారు మిత్ర‌ప‌క్షం విప‌క్షాలు. కానీ చంద్ర‌బాబుకు కేసీఆర్‌కున్నంత ద‌మ్ము ఉందా? అన్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్న‌. అవినీతి, రాజ‌కీయ హ‌త్య‌లు, కుంభ‌కోణాలతో పీక‌ల్లోతు మునిగిపోయిన బాబుకు కేసీఆర్‌లాగా బీజేపీని స‌వాలు చేసే ధైర్యం ఎంత మాత్ర‌మూ లేదని టీడీపీ నేత‌లే చెప్తున్నారు.దేశ రాజ‌కీయాల‌ను శాశించిన బాబుకు చివ‌ర‌కి ఈ గ‌తి ప‌ట్టింది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -