తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ కీయ చాతుర్యం చూసి కేంద్ర మంత్రులు ఆశర్యపోయారు అని చెబుతున్నాయి సన్నహిత వర్గాలు ప్రస్తుతం డిల్లీ టూర్ లో బిజీ గా ఉన్న కెసిఆర్ పలువురు మంత్రుల్ని కలుసుకున్నారు, రాజకీయ పరిశీలకులు కెసిఆర్ వారి ముందర ఎలాంటి అంశాలు లేవదీసారు అనేదాని మీద దృష్టి పెట్టి చూసి ఆశ్చర్యపోయారు అంటే నమ్మండి.
తెలంగాణా సర్కారు అధికారం లోకి వచ్చిన కొత్తల్లో నే వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, రహదారుల అభివృద్ధి, డ్రై పోర్ట్ ఏర్పాటు లాంటి వాటికి సంబందించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే అయితే వీటి అన్నింటికీ కేంద్రాన్ని సాయం చేయాలని కెసిఆర్ ఇవాళ కోరారు మంత్రుల్ని.
మిషన్ కాకతీయ కి , వాటర్ గ్రిడ్ లకీ తమ మానస పుత్రికలు అని కెసిఆర్ బాగా ప్రచారం చేస్తూనే త్వరగా వాటిని పూర్తి చేసే పనిలో పడ్డారు. వీటికి అవశ్రామైన నిధులు మాత్రం పూర్తి తెలివి తేటలు వాడేసి కేంద్రం నెత్తి మీద తోసేసే పనిలో పడ్డారు. తెలంగాణా ప్రభుత్వానికి చెందినా పథకాలు వారి ఖాతాలో పడగా నిధులు మాత్రం కేంద్రం నుంచి రావాలి సో క్రెడిట్ మొత్తం టీఆర్ఎస్ కి చిల్లు మాత్రం కేంద్రం కి. అదే ఇవ్వము అని మొండి చేయి చూపిస్తే కేంద్రం తీరు సరిగ్గా లేదు అంటూ విమర్శలు చేస్తారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలివితేటలు ముచ్చటపడేలా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదంతా చూసిన అరుణ్ జైట్లీ మీది సంపన్న రాష్ట్రమే కదా మళ్ళీ మళ్ళీ అప్పులు అని కెసిఆర్ మొఖం మీదనే అన్నట్టు సమాచారం. సంపంన్న రాష్ట్రమే అని చెప్పుకొంటూ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం ఆర్ధిక సాయం ఇవ్వాలి అని వారు కోరటం ద్వారా తమని తాము తక్కువ చేసుకోకుండా జాగ్రత్త గా డబ్బులు సాధించే క్రమం లో పడ్డారు.