Wednesday, May 7, 2025
- Advertisement -

కేసీఆర్ హాట్ కామెంట్.. ఈ సారి నిజం అవుతుందా?!

- Advertisement -

గతంలో తెలంగాణ ఎప్పుడు వస్తుంది? అనే అంశం గురించి కామెంట్లు చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత. ఢిల్లీలో రాజకీయ పరిస్థితుల గురించి హైదరాబాద్ లెవల్లో ఏదో ఒక వ్యాఖ్య చేసేవారు. తన కామెంట్లతో రాజకీయ వాతావరణాన్ని మార్చేసే వారు.

తనకు ఢిల్లీ నుంచి సూచనలు అందుతున్నాయంటూ కేసీఆర్ ఏదో ఒక కామెంట్ చేసేశారు. మరి అప్పటి సంగతి అలా ఉంటే.. ఇప్పుడు తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్ ఒక ఆసక్తికకరమైన వ్యాఖ్య చేశారు.

చంద్రబాబు పని అయిపోయిందని కేసీఆర్ అన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన ఈ వ్యాఖ్య చేసినట్టుగా తెలుస్తోంది. ఓటుకు నోటు వివాదం గురించి స్పందిస్తూ కేసీఆర్ చంద్రబాబు కథ అయిపోయిందని అన్నాడని సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. బాబు ఖేల్ ఖతం అన్నాడని వారు చెబుతున్నారు.

మరి కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యానాలు ఆసక్తిని రేకెత్తించాయి. ఇప్పుడు కూడా ఏపీ సీఎం విషయంలో ఆయన మాటలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. మరి ఈ సారి కేసీఆర్ కామెంట్లు నిజం అవుతాయా?! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -