- Advertisement -
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విషాదంలో మునిగారు. కల్వకుంట్ల కుటుంబంలో విషాదం నెలకొంది. సీఎం కేసీఆర్ రెండో అక్క విమల బుధవారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆమె బుధవారం మృతిచెందారు. హైదరాబాద్ అల్వాల్‌లో ఆమె అంత్యక్రియలు చేసే అవకాశం ఉంది.
సీఎం కేసీఆర్‌కు ఎనిమిది మంది అక్కలు ఉన్నారు. ఒక చెల్లె, ఒక అన్న కూడా ఉన్నారు. మృతిచెందిన విమల కేసీఆర్‌కు రెండో అక్క. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆమె ఇంటికి కేసీఆర్ చేరుకొని నివాళులర్పించారు.