Friday, May 9, 2025
- Advertisement -

కెసిఆర్ పై తెలంగాణ మేథావుల ధ్వజం

- Advertisement -

ఇది సంచలనం. ఇది తిరుగుబాటు. ఇది నిలదీయడం. తెలంగాణలో అప్రతిహతంగా సాగిపోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని,  ఆ మాటకొస్తే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుపై తెలంగాణ మేథావులు తిరగబడ్డారు. ఇది పాలన కాదు. మీకు చేతకాకుంటే దిగిపొండి అంటూ ప్రకటించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, విద్యుత్ జేఏసీ నేత రఘు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశించిన ఫలితాలు రావడం లేదని, ప్రజల బతుకుదెరువును విస్తరించే ప్రయత్నాలు ఒక్కటీ లేవంటూ తెలంగాణ జెఎసి నేత ప్రొఫెసర్ కోదండరామ్ మండిపడ్డారు.

ప్రజలు బాగుండాలనే సోయి ఉన్నా వాళ్లం. అందుకే ఇంకా సొంతంగా నిలబడి ఉన్నాం. లేకపోతే మా జెఎసిని ఎప్పుడో టిఆర్ఎస్ లో కలిపేసే వాళ్లం అని ఆయన అన్నారు. తెలంగాణ తన అస్ధిత్వాన్ని కాపాడుకున్నప్పుడే లక్ష్యాలు సాధించేందుకు వీలవుతుందని కోదండరామ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా కాంట్రాక్టు, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా పనిచేస్తే ప్రయోజనం ఉండదన్నారు. మరో వక్త ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తున్నట్లు కాదని అన్నారు.

ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా అంతా తమకే తెలుసుననే ధోరణిలో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జెఎసి నాయకుడు రఘు మాట్లాడుతూ  ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులు భవిష్యత్ లో తెలంగాణకు గుదిబండగా మారనున్నాయని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోని మణుగూరు విద్యుత్ ప్రాజెక్టు కారణంగా  రాష్ట్ర ఖజానాపై 10 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని, దీంతో పాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లనుందని అన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -