వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయాలలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ఇటీవలి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో కాపు టీడీపీ నాయకులు బాబును పొగడ్తలతో ముంచేశారు.
ఇదిలా ఉంటె కాపు ఉద్యమ నాయకుల స్పందన మరోలా ఉంది. భోజనం పెట్టమంటె బాబు టిపిన్ పెట్టారని కాపు ఉద్యమనేత ముద్రగడ విమర్శించారు. దీన్ని కంటితుడుపు చర్యగా అభివర్నించారు. రిజర్వేషన్ల అంశం కేంద్రపరిధిలో ఉంది. కాపులకు 5 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించి షెడ్యూల్ 9 లో చేర్చితే అది చట్టంగా మారుతుంది. అప్పుడు కాపులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.
బాబు తీసుకున్న ఈ నిర్ణయానికి చట్టబద్దత కల్పించాలని ముద్రగడ డిమాండ్ చేశారు. ముద్రగడ తదుపరి కార్యాచరన ఏంటనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. జగన్‌తో చేతులు కలిపేందుకె కాపు ఉద్యమనేత ముద్రగడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయనె వార్తలు వినిపిస్తున్నాయి.
జగన్‌తో కలవడానికి ప్రధానం కారనం విడిగా ఉద్యమాలు చేస్తుంటె తెలివిగా తనని తొక్కేస్తున్నారు అని అర్ధం చేసుకున్న ముద్రగడ జగన్ మోహన్ రెడ్డి తో కలవడమే బెటర్ ఆప్షన్ గా ఎంచుకున్నారంట. చంద్రబాబు ఇలాంటి కంటి తిడుపు చర్యలు చేస్తూ ఉంటె ఎదిరించడం కోసం తనకి జగన్ లాంటి శక్తి ఉంటె బెటర్ అని భావిస్తున్నారట. ముద్రగడ జగన్‌తో చేతులు కలితె వైసీపీ బలం పుంజుకోనుంది. భవిష్యత్తులో ఏంజరుగుతుందో చూడాలి.