Sunday, May 4, 2025
- Advertisement -

చంద్రబాబుకు లేఖ రాసిన కెవిపి

- Advertisement -

తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడులో భారతీయ జనతాపార్టీతో పొత్తు, ఇతర అంశాలపై తీర్మానాలు చేయడం కంటే ఎపికి ప్రత్యేక హోదా తీసుకువచ్చే అంశంపై తీర్మానం చేయాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె.వి.పి.రామచంద్రరావు అన్నారు.

ఈ మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసారు.  ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని సిఎం అనడం సరికాదని లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రానికి రావాల్సి ఆర్ధిక సాయం సాధించడంలో కేంద్రాన్ని అందరూ నిలదీయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై ప్రయివేట్ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వాలని కెవిపి డిమాండ్ చేశారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -