- Advertisement -

మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు..

- Advertisement -

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA) లో కలకలం రేపిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ శిక్షణ పొందుతున్న ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై తోటి ట్రైనీ అధికారి తీవ్రమైన వేధింపులకు, లైంగిక దాడికి పాల్పడటం సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి.

కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళా అధికారి శివరాంపల్లిలోని అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. గత నెల 23వ తేదీ నుండి తోటి ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తనను తీవ్రంగా వేధిస్తున్నాడని, బూతులు తిడుతూ తోటి అధికారుల ముందు తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపించారు. వేరే అధికారితో తనకు వివాహేతర సంబంధం ఉందని ఒప్పుకోవాలంటూ ఆయన బలవంతం చేసేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నెల 8వ తేదీన తనను బలవంతంగా గదికి తీసుకెళ్లి బెదిరించి ఫోన్ పాస్‌వర్డ్ అడిగాడని, మరుసటి రోజు (9వ తేదీన) మరింత తెగబడి జుట్టు పట్టుకుని గదిలోకి లాక్కెళ్లాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. మెడపై కత్తి పెట్టి బంధించి, మొహంపై మూడు కండోమ్ ప్యాకెట్లు విసిరాడని, తన ప్రైవేట్ పార్ట్స్‌ను తాకుతూ అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. అంతేకాకుండా, తనకు తెలియకుండా తన ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి, వాటిని తన భర్తకు పంపిస్తానని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేశాడని ఆమె కన్నీటిపర్యమయ్యారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -