ఏపీ ముఖ్యమంత్రికి భయం ఎందుకు..? ప్రస్తుతం ప్రభుత్వం బానే నడుస్తోందిగా అనేది మీ డౌటు..? రేపు చంద్రబాబు రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లో భాగంగా తనయుడు లోకేష్ కి మంత్రి పదవి కట్టబెట్టబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై పార్టీ కీలక నేతల్లో లోకేష్ ఒకరు కాబోతున్న టైంలో మనం ఒక్క సారి ఉత్తరప్రదేశ్ సమాజ్ వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ని గుర్తు చేసుకుందాం.
ఉత్తరప్రదేశ్ లో తిరుగులేని అధికారాన్ని చెలాయించిన ములాయం సింగ్ పార్టీ లో ఒక పెద్ద ముసలమే చెలరేగిందనే విషయం తెలిసిందే. అయితే దానికి ప్రధాన కారణం అఖిలేష్ యాదవ్ అని స్పష్టంగా చెప్పవచ్చు. పార్టీలోకి కొడుకుని తీసుకొచ్చి.. ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టి సింహాసనం మీద కూర్చోబెడితే ఆయన తన తండ్రి పదవికే ఎసరు పెట్టి పార్టీలో పెద్ద ప్రకంపనమే లేపాడు.
ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏమైంది. వారి స్థానాలను కాస్తా బీజీపీ ఖైవసం చేసుకుంది. సరిగ్గా ఇదే పరిస్థితి మనం తెలుగుదేశం పార్టీలో ఊహించవచ్చా..? అని ప్రశ్నించుకుంటే చెప్పలేం అనే జవాబు వస్తోంది. కారణం రాజకీయాల్లో ఏ టైంకి ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అఖిలేష్ బుద్ధి మారినట్టే లోకేష్ బుద్ధి కూడా మారొచ్చుగా.. బాబు ఉండగానే లోకేష్ పెద్ద కుర్చీ కోసం ప్రయత్నాలు చేయడని ఖచ్చితంగా చెప్పలేం. ఏది ఏమైనా లోకేష్ కు బాబు మంత్రి పదవిని కట్టబెట్టడం అంటే కొరివితో తల గోక్కోవడమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.