Thursday, May 9, 2024
- Advertisement -

మాడా వెంకటేశ్వరరావు ఇకలేరు…

- Advertisement -

ప్రముఖ హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు కన్నుమూశారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

తూర్పు గోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన మాడా వెంకటేశ్వరరావు 10 అక్టోబర్, 1950లో జన్మించారు. 

మాడా సినిమాల్లోకి రాకముందు విద్యుత్ సంస్థలో ఉద్యోగం చేశారు. అనంతరం సినిమాలో అవకాశాలు రావడంతో హాస్యనటుడిగా సిని పరిశ్రమలో స్థిరపడ్డారు. అనేక సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముత్యాలముగ్గు, చిల్లరకొట్టు చిట్టెమ్మ, లంబాడోళ్ల రాందాసు, మాయదారి మల్లిగాడు, ముత్యాలముగ్గు, సఖియా, శివయ్య, తదితర సినిమాలతో మంచి గుర్తింపు పొందారు. 

మాడాకు అభినయ కళానిధి అనే బిరుదు ఉంది. కాగా, మాడా మృతి విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మాడా మృతదేహాన్ని చూసేందుకు సినీ ప్రముఖులు అపోలో ఆస్పత్రికి తరలి వస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -