- Advertisement -
టాలీవుడ్ యువ నటుడు ప్రిన్స్ మహేశ్ బాబు దత్తత తీసుకున్న గ్రామంలో అతడి సతీమణి నమ్రత శిరోద్కర్ నేటి ఉదయం పర్యటించారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్ గ్రామాన్ని మహేశ్ బాబు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ గ్రామంలో ఓ సారి పర్యటించిన నమ్రత… నేటి ఉదయం ఆ గ్రామానికి మరోమారు వెళ్లారు. గ్రామంలో ‘హీల్ ఏ చైల్డ్’ పేరిట ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలోని 14 ఏళ్ల లోపు ఉన్న 300 మంది పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు చేయించిన ఆమె… అవసరమైన చికిత్సలను చేయించారు.
అనంతరం గ్రామంలోని వీధుల్లోకి వెళ్లిన ఆమె గ్రామం మొత్తం కలియదిరిగారు. గ్రామాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలేమిటని ఆమె ఈ సందర్భంగా గ్రామస్తులను ఆరా తీశారు. సమస్యలన్నింటినీ విడతలవారీగా పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.