Sunday, May 4, 2025
- Advertisement -

పది గ్రామాలను దత్తత: మంచు విష్ణు మంచి మనసు!

- Advertisement -

సినీ హీరో మంచు విష్ణువర్ధన్ బాబు తన సహృదయతను చాటుకొన్నాడు. ఏకంగా పదిగ్రామాలను దత్తత తీసుకొని అందరినీ ఆకట్టుకొంటున్నాడు.

తమకు సొంత జిల్లా అయ్యే చిత్తూరుపై మంచు వారబ్బాయి దృష్టి సారించారు. ఆ జిల్లాలోని చంద్రగిరి మండలంలోని పది గ్రామాలను విష్ణు దత్తత తీసుకొన్నాడు. అక్కడ ప్రాథమిక సౌకర్యాల కల్పనకు విష్ణు నడుం బిగించాడు. ఆ గ్రామాలకు విద్య, మంచినీరు, మరుగుదొడ్లు  వంటి కనీస సౌకర్యాలను కల్పించడానికి ముందడుగు వేశాడు.

ఇప్పటికే కొన్ని టాయ్ లెట్ల నిర్మాణం పూర్తయినట్టుగా తెలుస్తోంది. మరికొన్నింటి నిర్మాణానికి పూనుకొంటున్నట్టుగా తెలుస్తోంది. ఇది వరకే మంచు విష్ణు మహారాష్ట్ర లోని షిర్పూర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి వచ్చాడు. బాగా కరువు ప్రాంతం అయిన అక్కడ పరిస్థితుల గురించి అధ్యయనం చేసి వచ్చారు. ఒకప్పుడు బాగా కరువు ప్రాంతం.. భూ గర్భ జలాల అడుగంటిన ఆ ప్రాంతంలో స్థానికులు తీసుకొన్న చర్యలతో మారిన పరిస్థితుల గురించి విష్ణు తెలుసుకొని వచ్చారు.

మరి ఇప్పుడు అలాంటి చర్యలను కరువు ప్రాంతం అయిన చిత్తూరు ప్రాంతంలో కూడా అమల్లో పెట్టాలని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇదే జరిగితే ఆ ప్రాంతంలో గొప్ప మార్పు రావొచ్చు కూడా. ఇలాంటి పనిని చేపట్టిన మంచు విష్ణును అభినందించి తీరాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -