ఒకప్పుడు పెళ్లిళ్లు అబ్బాయిలు ఒప్పుకుంటే సరిపోయేది. కాని కాల క్రమేణ పద్దతులలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు పెళ్లి జరగాలంటే అబ్బాయి అనుమతితో పెద్దగా పని లేదు. ఇక్కడ అనుమతి కావాల్సింది వధువు తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. చాలా పెళ్లిళ్లు పీటలు దగ్గరికి వచ్చి అమ్మాయికి నచ్చక ఆగిపోయిన పెళ్లిళ్లు చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి బిహార్‌లో జరిగింది. పెళ్లి మండపానికి పూటుగా మందు కొట్టి వచ్చినందుకు ఓ యువతి ఏకంగా పెళ్లినే క్యాన్సిల్ చేసుకుంది.
తిలక్ పూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి అదే ఊరికి చెందిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దవాళ్లు నిర్ణయించారు. తాళి కట్టే సమయంలో అతను మద్యం తాగాడని గమనించిన యువతి పెళ్లి పీటల నుంచి లేచింది. ఇలాంటి వ్యక్తిని తాను పెళ్లి చేసుకోబోనని మొహం మీదే కొట్టినట్లు చెప్పేసింది. అమ్మాయికి నచ్చజెప్పేందుకు ఇరు కుటుంబాల పెద్దలు యత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చివరికి పీటలవరకూ వచ్చిన పెళ్లి ఆగిపోయింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. సంపూర్ణ మద్య నిషేదం ఉన్న బిహార్ రాష్ట్రంలో మద్యం తాగినందుకు వరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
- Advertisement -
మద్యం మత్తులో తాళి కట్టబోయిన వరుడు..తరువాత ఏం జరిగిందో తెలుసా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -