కొడుకు పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు..వరుణ్ పెళ్లితో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ

Nagababu Shocking comments on his son varun tej marriage news
Nagababu Shocking comments on his son varun tej marriage news

మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్న సంగతి అందరికి తెలిసింది. వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకోబోతున్నాడంటూ గత రెండు రోజులుగా మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరు అంతరిక్షం అనే సినిమాలో కలిసి నటించారు. 2018లో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. అప్పటి నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు షికార్లు చేశాయి. ఈ వార్తలను అటు వరుణ్ తేజ్‌తో పాటు, ఇటు లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా కొట్టిపారేశారు. కట్ చేస్తే.. మరికొద్ది రోజుల్లో వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠిలు పెళ్లి పీటలెక్కనున్నారనే వార్త తెర మీదకు వచ్చింది. ఈ నెల 9 వ తారీఖున నిశ్చితార్థం ద్వారా ఒక్కటి అవ్వబోతున్నారు. అయితే ఈ పెళ్లీపై వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ఇద్దరు ఇప్పటి వరకు స్పందించలేదు.

ఇదే సమయంలో రీసెంట్‌గా కొడుకు పెళ్లి గురించి మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఒక ఇంటర్వ్యూ పాల్గొన్న ఆయన వరుణ్ తేజ్ పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం జరిగింది. వరుణ్ తేజ్‌కు త్వరలోనే చెయ్యబోతున్నాము..పెళ్లి కూతురు ఎవరూ ఏమిటి అనేది వరుణ్ బాబు తెలియచేస్తాడు ఆయన తెలిపారు. అప్పటి వరకు నేను నోరు విప్పను, నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను వదిలేయండి అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ పెళ్లి ఫిక్స్ అని డిసైడ్ అయిపోయారు. ఒకవేళ లావణ్య త్రిపాఠితో పెళ్లి లేకపోతే ఆ వార్తను ఆయన ఖండించేవాడు కదా అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ నుండి ఆఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ కోసం మెగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.