- Advertisement -
ఓరుగల్లు నగరంలో కాకతీయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ 4 సంవత్సరం చదువుతున్న మౌనిక, సమీపంలో లక్కిరెడ్డి లేడీస్ హాస్టల్ లో ఉంటూ వైద్యవిద్యను అభ్యసిస్తోంది. హాస్టల్ లో ఉంటున్న సహచర విద్యార్ధినీలందరూ కాలేజీకి వెళుతున్న క్రమంలోనే..యువతి మౌనిక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలవరానికి గురి చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు..విద్యార్ధిని మౌనిక ఉంటున్న హాస్టల్ లోని ప్రతీ వస్తువును క్షుణ్ణంగా పరిశీలనలో పడ్డారు. తోటి విద్యార్ధుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న పోలీసులు…కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సెమిస్టర్లు జరిగే సమయంలోనే విద్యార్ధిని మౌనిక ఆత్మహత్య చెందిందింటే, ఆ పరీక్షలకు భయపడే ఈ దారుణానికి ఒడి గట్టిందా .! అన్న కోణంలోనే పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.