Monday, April 29, 2024
- Advertisement -

జగన్ను ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే !

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ లో సి‌ఎం జగన్ అధికరంలోకి వచ్చిన తరువాత ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పరిపాలనలో తనదైన ప్రత్యేకత కనబరుస్తూ ముందుకు సాగుతున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వాలెంటరీ వ్యవస్థ, మరియు సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టి ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత దగ్గర చేశారు. ఇక ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజా శ్రేయస్సు లో వెనుకడుగు వేసేది లేదని వైఎస్ జగన్ చెప్పకనే చెబుతున్నారు. అయితే జగన్ ప్రవేశ పెడుతున్న కొన్ని సంక్షేమ పథకాల విషయంలో కొంత వ్యతిరేకత కూడా ఉందనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. జగన్ కొన్ని పథకాల ద్వారా ప్రభుత్వ ఖజానా ను ధారాళంగా ఖర్చు చేస్తున్నారని, అలా ఖర్చు చేయడం వల్ల తిరిగి ప్రజలపైనే భారం పడుతుందని జగన్ పరిపాలన విధానాన్ని తప్పుబట్టే వారు కూడా ఉన్నారు.

వాహన మిత్రా.. ఇంటింటి రేషన్ వంటి పథకాల ద్వారా డబ్బు వృదా అవుతోందని వాటి స్థానంలో ప్రజలకు ఉపయోగకరంగా ఉండే మంచి పథకాలు ప్రవేశ పెట్టవచ్చని కొందరు సలహాలు కూడా ఇస్తున్నారు. వారు చెప్పేదాంట్లో కూడా వాస్తవం లేకపోలేదు. ఈ విధంగా జగన్ పరిపాలనపై కొంత వ్యతిరేకత.. మరికొంత సమర్థత రెండు సమపాళ్లలోనే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే జగన్ ప్రవేశ పెడుతున్న పథకాలు ఎలా ఉన్నప్పటికి.. విద్యా వైద్య రంగాల్లో మాత్రం ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూడుతూనే ఉన్నారు. ఇక పేదలకు వైద్యాన్ని దగ్గరచేసే ప్రయత్నంలో భాగంగా సి‌ఎం జగన్ తీసుకున్న నిర్ణయం నిజంగా ప్రశంసనీయం అనే చెప్పాలి.

గ్రామాల్లో నివసించే ప్రజలు మెరుగైన వైద్యానికి నోచుకోవడం లేదనే చెప్పాలి. ఈ సమస్యను అధిగమించే దిశగా గ్రామీణ ప్రజలకు స్పెషలిస్ట్ వైద్యుల సేవలను అందుబాటులోకి తీసుకోచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సి హెచ్ సి, ఏరియా హస్పేటల్స్, జిల్లా ఆసుపత్రులలో పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన వైద్యులు గ్రామాల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టింది. ముందుగా తొలి ప్రదాన్యత కింద ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో వారిని నియమిస్తుంది ఏపీ ప్రభుత్వం. నిజంగా ఈ విధానం పూర్తి స్థాయిలో గ్రామాల్లో అందుబాటులోకి వస్తే.. గ్రామాల్లో కూడా పట్టణ స్థాయి వైద్యం అందడం ఖాయం.

Also Read

బాలయ్య షోలో చంద్రబాబు.. పోలిటికల్ వ్యూహమేనా ?

టి‌ఆర్‌ఎస్ (TRS) చాప్టర్ క్లోజ్.. ఇక కే‌సి‌ఆర్ కు గడ్డుకాలమే !

జనసేనలోకి చిరు ఎంట్రీ.. పవన్ ఒప్పుకుంటాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -