Tuesday, May 6, 2025
- Advertisement -

అధునాతన సౌక‌ర్యాల‌తో త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న‌మెట్రో రైలు

- Advertisement -
Metro Rail Expects to Complete by Year End

హైదరాబాద్ నగరవాసుల మెట్రోరైలు కల మరో మూడు నెలల్లో తీరనున్నది.ఇప్ప‌టికే అనేక సార్లువాయిదా ప‌డుతూ వ‌స్తున్న మెట్రోరైల్ జూలైలో ప‌ట్టాలెక్కేనుంది.2018 డిసెంబరునాటికి 66 కిలోమీటర్ల మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నది.

మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.14,132 కోట్లు కాగా… ఇప్పటివరకు ఎల్ అండ్ టీ సంస్థ దాదాపు రూ.12 వేల కోట్లు ఖర్చుచేయగా, ప్రభుత్వం తన వాటా కింద రూ.2,100 కోట్లు కేటాయించింది. మొద‌ట‌గా రెండు కారిడార్ల‌లో అందుబాట‌లోకి రానుంది.
మొద‌టి కారిడార్‌లో నాగోల్‌- నుంచి హైటెక్ సిటీ కారిడార్‌ను ఈ సంవ‌త్స‌రంలో ప్రారంభిస్తారు. ఇప్ప‌టికే ఇక్క‌డ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. రెండో కారిడార్ అయిమియాపూర్‌ – ఎస్‌.ఆర్‌.నగర్ వ‌ర‌కు 12 కి.మీ వ‌ర‌కు ప‌నులు పూర్త‌య్యాయి. ఈ మార్గంలో భరత్‌నగర్‌ రైల్వే లైన్‌ పైనుంచి మెట్రో వయాడక్ట్‌ నిర్మాణం ప‌నులు కూడా పూర్త‌య్యాయి. ప్రారంభ‌తేదీమాత్రం ప్ర‌భుత్వం చేతిలో ఉంది.ఇప్ప‌టికే ఆల‌స్య‌మ‌యిన నేప‌థ్యంలో ఇంక అల‌స్యం చేయ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది.
ఇందులో రవాణా వ్యవస్థ కీలకమని, సీమ్‌లెస్ కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నామన్నార‌కు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి. ఆర్టీసీ, ఎంఎంటీఎస్, రైల్వేతో అనుసంధానం చేసుకుంటూ మెట్రోరైలు కార్యకలాపాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ, మెట్రోరైలుకు కామన్ టికెట్ వర్తించేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, ఎంఎంటీఎస్‌తో చర్చించాల్సి ఉన్నదన్నారు. కామన్‌కార్డు అందజేసేందుకు చాలా బ్యాంకులు ముందుకు వస్తున్నాయన్నారు. ఈ కార్డుతో షాపింగ్ చేసే వెసులుబాటు కూడా ఉన్నదని చెప్పారు.
మెట్రోరైలు స్టేషన్లతోపాటు కారిడార్లిన్నింటినీ సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం ఒక్కో స్టేషన్‌కు రూ.కోటి ఖర్చు చేయ‌నున్నారు. సైక్లింగ్, వాకింగ్‌ను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టామన్నారు. స్కైవాక్‌లకు, ఫుట్‌పాత్‌లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మెట్రో కారిడార్లలో 400 బైక్ స్టేషన్లను ఏర్పాటు చేసి, 10,000 బైక్‌లను అందుబాటులో ఉంచునున్నారు.
ప్రాజెక్టులో భాగంగా 32 మల్టీలెవెల్ పార్కింగ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులకు కావాల్సిన ప్రతీ వస్తువును మెట్రో స్టేషన్‌లోనే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాల కోసం మల్టీప్లెక్స్‌లు అందుబాటులోకి తేనున్నారు.

Also read

  1. జియో కొత్త పథకం.. 100 శాతం క్యాష్ బ్యాక్
  2. నింగిలోకి దూసుకెల్లిన‌.. సార్క్ ఉప‌గ్ర‌హం
  3. జీశాట్ -9 ఉప‌గ్ర‌హం…..
  4. ప్ర‌పంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్న భార‌తీయ రైల్వే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -