Friday, May 17, 2024
- Advertisement -

నింగిలోకి దూసుకెల్లిన‌.. సార్క్ ఉప‌గ్ర‌హం

- Advertisement -
Isro launches South Asian satellite from Sriharikota

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి సత్తా చాటింది.జీఎస్ ఎల్‌వీ ఎఫ్‌09 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం సాయంత్రం 4.57 నిమిషాలకు జీఎస్ ఎల్‌వీ ఎఫ్‌09 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించారు. దీనికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 12.57 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే.

జీఎస్ఎల్వీ తరహా రాకెట్లలో ఇది ప‌ద‌కొండ‌వ మిషన్ కావ‌డం విశేషం. స్వ‌దేశీ క్ర‌యోజెనిక్ ఇంజిన్‌తో జీఎస్ఎల్వీని ప్ర‌యోగించారు. కేయూ బ్యాండ్ ద్వారా జీశాట్ శాటిలైట్ కమ్యూనికేష‌న్లు అందిచ‌నున్న‌ది. ద‌క్షిణ ఆసియా దేశాల‌కు జీశాట్ వ‌ల్ల లాభం చేకూర‌నున్న‌ది. స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్‌లోని రెండ‌వ ల్యాంచ్ పాడ్ నుంచి జీఎస్ఎల్వీని ప్ర‌యోగించారు. విపత్తుల సమయంలో ఈ ఉపగ్రహం కీలకంగా పనిచేయనున్నది.

ఈ రాకెట్‌ ద్వారా 2,230 కిలోల బరువు కలిగిన విశాట్‌–9(దక్షిణాసియా దేశాల శాటిలైట్‌) ఉపగ్రహాన్ని భూమికి 36వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహంలో 12 కేయూ బ్రాండ్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ను అమర్చారు. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు దేశాలకు ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది.ఉపగ్రహం తయారీకి ఇస్రో రూ.235కోట్లు ఖర్చు చేసింది. మొత్తం ఈ ప్రాజెక్టుకు రూ.450కోట్లు వెచ్చించింది.

Related

  1. పాక్‌పై మండిప‌డ్డ‌ ఉత్త‌ర కొరియా….
  2. అగ్ని -2 ,బ్ర‌హ్మాస్ మిస్సైల్ల‌ను..విజ‌య‌వంతంగా ప‌రీక్షించిని భార‌త్‌
  3. శిల్పా వ‌ర్గానికి చెక్ పెట్టేందుకు తెర‌పైకి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి
  4. మహిళా ఎమ్మెల్సీలకు ఆ వీడియోలు పంపిన బీజేపీ ఎమ్మెల్సీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -