Tuesday, May 6, 2025
- Advertisement -

త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్న అమీర్‌పేట్‌- హైటెక్ సిటీ మెట్రో…

- Advertisement -

హైటెక్ సిటీ ప్రాంతంలో ప‌నిచేసె ఉద్యోగులు, విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. త్వ‌ర‌లో అమీర్‌పేట‌- హైటెక్ సిటీ మార్గంలో త్వ‌ర‌లో మెట్రో ప‌ట్టాలెక్క‌నుంది. ఇప్పటికే ఈ మార్గంలో మెట్రో ట్రైల్ రన్ సాగుతుండగా… ఇవాళ ఈ రూట్‌లోని మెట్రో మార్గాన్ని తనిఖీ చేశారు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ అధికారులు. త్వరలోనే సీఎంఆర్‌ఎస్ పరీక్షలు, సర్టిఫికెట్ వస్తే మెట్రో రైలును అధికారులు ప్రారంభించనున్నారు. అమీర్‌పేట, హైటెక్ సిటీ వరకు 11 కిమీల దూరం ఉంటుంది.

మొదటి దశలో భాగంగా ఇప్పటికే నాగోల్-అమీర్‌పేట, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాలు ప్రారంభమయ్యాయి. ఆ మార్గాల్లో 64 మెట్రోస్టేషన్లు ఉన్నాయి. మొదటి దశలోని 72 కిలోమీటర్లలో 46 కిలోమీటర్ల మేర మెట్రో పూర్తయింది. అమీర్‌పేట, హైటెక్‌సిటీ మధ్య 11 కిలోమీటర్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. మొదటి దశలో మిగిలిన జేబీఎస్, ఎంజీబీఎస్ మధ్య 10 కిమీల దూరం, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మెట్రో రూట్ కోసం పనులు జరుగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -