Sunday, May 19, 2024
- Advertisement -

హైద‌రాబాద్ మెట్రోరైలు ఛార్జీల‌ను ప్ర‌క‌టించిన ఎల్‌&టీ మెట్రోరైల్‌…

- Advertisement -

అందరూ ఎంతగానో ఎదరుచూస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానుంది. ఈ నెల 28న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించనున్న విష‌యం తెలిసిందే. టికెట్ ధరలు ఎలా ఉంటాయ‌న్న ప్ర‌యానికుల్లో ఉన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. రేప‌టి నుంచి మెట్రో స్మార్ట్ కార్డుల విక్ర‌యాలు జ‌రుపుతారు. ఛార్జీల‌కు సంబందించిన వివ‌రాల‌ను ఎల్‌&టి ప్ర‌క‌టించింది. కనీసీ ధ‌ర రూ.10…గ‌రిష్ట ధ‌ర రూ.60.ఈ నెల 29 నుంచి ప్ర‌యాణికులు మెట్రో రైల్ సేవ‌ల‌ను అందుకోవ‌చ్చు.

ఛార్జీల వివరాలు…
క‌నిష్ఠ ఛార్జీ రూ.10
గ‌రిష్ఠ చార్జీ రూ.60
2 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ఛార్జీ-రూ.10
2 కి.మీ నుంచి 4 కి.మీ.ల వ‌ర‌కు ధ‌ర-రూ.15
4 కి.మీ నుంచి 6 కి.మీల వ‌ర‌కు – 25
6 కి.మీ నుంచి 8 కి.మీ.ల వ‌ర‌కు – రూ.30
8 కి.మీల నుంచి 10 కి.మీల వ‌ర‌కు- రూ.35
10 కి.మీ నుంచి 14 కి.మీ.ల వ‌ర‌కు-రూ.40
14 కి.మీ నుంచి 18 కి.మీ.ల‌ వ‌ర‌కు -రూ.45
18 కి.మీ నుంచి 22 కి.మీ.ల వ‌ర‌కు- రూ.50
22 కి.మీ నుంచి 26 కి.మీ.ల వ‌ర‌కు -రూ.55
26 కి.మీ.ల పైన-రూ.60

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -