Saturday, May 10, 2025
- Advertisement -

తెలంగాణ ఆవిర్భావదినోత్సవ కానుక

- Advertisement -

నగరంలో మెట్రో రైళ్లు త్వరలో పట్టాలు ఎక్కనున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 వ తేదిన రెండు రైళ్లను నడపాలని ఎల్ అండ్ టి, హెచ్ ఎం ఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముందుగా ఎనిమిది కిలోమీటర్లు దూరం ఉన్న నాగోలు – మెట్టుగుడా, పన్నెండు కిలోమీటర్ల దూరం ఉన్న మియాపూర్ – ఎస్ ఆర్ నగర్ ల మధ్య మెట్రో రైళ్లను నడపాలని భావిస్తున్నారు.

నిజానికి ఈ రెండు రైళ్లను ఉగాది నాటికి సిద్ధం చేయాలని ప్రయత్నించినా కొన్ని సాంకేతిక కారణాల రీత్యా ప్రారంభించలేదు.  ఈ రెండు మార్గాల్లోనూ రైల్వే శాఖ సేఫ్టీ పరీక్షలు నిర్వహించి రైల్వే బోర్డుకు ఆ నివేదికలు పంపించింది. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రెండు మార్గాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

తెలంగాణ ఆవిర్భావదినోత్సవానికి వీటిని అందుబాటులోకి తీసుకువస్తే ఇంతకు ముందు జరిగిన జాప్యాన్ని సరిదిద్దుకోవచ్చునని ఎల్ అండ్ టి సంస్ధ భావిస్తోంది. ఇక పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీనిపై అనేక ఇబ్బందులు ఉన్న దృష్ట్యా త్వరలోనే వాటిని పరిష్కరించి పనులు చేపట్టాలని భావిస్తున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -