Tuesday, May 14, 2024
- Advertisement -

మోడీ ప్రధానికాదు.. ప్రైమ్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా?!

- Advertisement -

మరి తెలిసి చేస్తున్నారో.. ఎవరేమనుకొంటే తనకే అనుకొంటున్నారో కానీ..ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యవహరిస్తున్న తీరు కాస్తంత విడ్డూరంగా.. కొంత కామెడీ గా ఉంది.

మోడీ తీరు విడ్డూరంగా ఉండగా… ఈ తీరుతో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ పరిస్థితి కామెడీగా మారింది. మోడీ క్యాబినెట్ లో సుష్మాస్వరాజ్ విదేశాంగ మంత్రిగాఉన్న విషయం విదితమే.

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అయిన సుష్మాకు ఆ హోదా తగినదే. అయితే ఆమెకు పదవీ బాధ్యతల విషయంలో మాత్రం మోడీ ద్వారా అడ్డంకులు ఎదురవుతున్నాయని సమాచారం. సాధారణంగా విదేశాంగ మంత్రులు విదేశాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. విదేశీ వ్యవహారాల గురించి సమీక్షిస్తూ ఉంటారు. అయితే మోడీ మాత్రం సుష్మకు ఆ అవకాశం ఇవ్వడం లేదు.
ప్రధానమంత్రి అయ్యింది హద్దు నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు చేపడుతూనే ఉన్నారు. తొమ్మిది నెలల్లో ఏకంగా 11 విదేశీ పర్యటనలు చేపట్టిన ఘనత నరేంద్రమోడీది.మరి ఈ విదేశీ పర్యటనల్లో ఆయన ఒక్కసారి కూడా విదేశాంగ శాఖ మంత్రి ని వెంట తీసు కెళ్లలేదు. సాధారణంగా ఏప్రధాని విదేశాలకు వెళ్లినా విదేశాంగ మంత్రిని వెంట తీసుకెళతారు. అయితే మోడీ మాత్రం ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదు.
దీంతో సుష్మాకు పని లేకుండా పోయింది. ఒకవైపు ప్రధాని విదేశాల్లో తిరుగుతుంటే సుష్మమాత్రం స్వదేశంలో ఉంది. ఈ విషయంలో విమర్శలు వస్తున్నా మోడీ లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో మోడీ ని కొంతమంది ప్రైమ్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా.. అంటూ కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -