చలో అమరావతి పాదయాత్రకు బయల్దేరిన కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడటంతో కిర్లంపూడిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా నేటితో గృహ నిర్బంధం ముగియడంతో ఆయన గురువారం ఉదయం పాదయాత్రకు బయల్దేరారు. అయితే ముద్రగడను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు.
పాదయాత్రను అడ్డుకుంటున్న చంద్రబాబు తీరు పై ముద్రగడ మండిపడ్డారు .ఇది మీ జాగిరా కాదు మీ ఆస్తులు దోచుకోవడానికి పాదయాత్ర చేస్తున్నామాని నిలదీశారు. మా జాతిని అనగదొక్కడానికి మీరు మాజాతి మీదా కక్ష సాధింపు చేస్తున్నారు అని మీ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారు అని మీరుమేము పాదయాత్ర చేయకుండా అడ్డుకొని ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇస్తున్నారన్నారి బరస్ట్ అయ్యారు.
మంత్రితో పాదయాత్రపై తప్పుగా మాట్లాడిస్తున్నారని ..నేను పాదయాత్ర చేస్తే మీరు మీ మంత్రి తో రాజీనామా చేయించండి లేకపోతే నేనే ఉద్యమాన్ని వదలి వేస్తాను దీనికి మీరు సిద్ధమేనా అని చంద్రబాబు కి సవాల్ విసిరారు.
ఇప్పటికే ప్రభుత్వానికి పాదయాత్రపై రూట్‌మ్యాప్ అందచేశా. ఇది నిరవధిక పాదయాత్ర… వాయిదా వేసేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పాదయాత్ర చేసి తీరుతా.’ అని స్పష్టం చేశారు. మరోవైపు ముద్రగడ నివాసం వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.