- Advertisement -

మెట్రో స్టేషన్‌లో గర్ల్ ఫ్రెండ్‌తో కొడుకు..తల్లి ఏం చేసిందో తెలుసా?

- Advertisement -

ముంబై మెట్రో స్టేషన్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న కొడుకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో జరిగిన ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అనుకోకుండా అక్కడికి వచ్చిన అబ్బాయి తల్లి, కొడుకు–అమ్మాయిని చూసి షాక్‌కు గురైనప్పటికీ పరిస్థితిని చాలా తెలివిగా హ్యాండిల్ చేసింది. గొడవలు చేయడం, ఆగ్రహం వ్యక్తం చేయడం కంటే, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆమె నిర్ణయించుకుంది.

అక్కడికక్కడే ఇద్దరికీ ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేసి, ఆ ఘట్టాన్ని వీడియోగా రికార్డు చేయించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపై రహస్యంగా కలవాల్సిన అవసరం లేకుండా, కుటుంబాల మధ్య కూడా విషయాన్ని క్లియర్ చేసిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

తల్లి చూపిన పరిణతి, ధైర్యం, ప్రాక్టికల్ ఆలోచనలపై సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ కురుస్తోంది. “ఇదే అసలు పేరెంటింగ్”, “సమస్యను గొడవగా కాకుండా పరిష్కారంగా మార్చారు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -