- Advertisement -

‘ఎల్లమ్మ’..అసలు రహస్యం ఇదే!

- Advertisement -

టాలీవుడ్ టాలెంటెడ్ మ్యూసిగ్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సంగీతం అందిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కేవలం సంగీత దర్శకునిగానే కాకుండా సినిమా హీరోగా కూడా వెండితెరకు పరిచయం అయ్యేందుకు సిద్ధమయ్యారు. ‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీని కదిలించిన వేణు యెల్దండి దర్శకత్వంలో రాబోతున్న విలేజ్ డివోషనల్ డ్రామా ఎల్లమ్మ చిత్రంతో డీఎస్పీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. హీరోగా మారేందుకు ఎన్నో కథలు విన్నప్పటికీ.. అసలు ఈ ‘ఎల్లమ్మ’ సినిమానే ఓకే చేయడానికి గల ఒక బలమైన ఎమోషనల్ కారణాన్ని దేవిశ్రీ ప్రసాద్ తాజాగా వెల్లడించారు.

ఈ సినిమా కథ వినగానే తనకు బాగా కనెక్ట్ కావడానికి ప్రధాన కారణం తన తండ్రి.. దివంగత ప్రముఖ రచయిత సత్యమూర్తి గారి పుట్టిన ఊరని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. సత్యమూర్తి గారి సొంత ఊరైన తూర్పుగోదావరి జిల్లాలోని ‘వెదురుపాక’ గ్రామ మూలాలు.. అక్కడి సంస్కృతీ సాంప్రదాయాల ప్రభావం తనపై చాలా ఉందన్నారు. చిన్నప్పటి నుంచి తండ్రి ద్వారా విన్న ఆ ఊరి కథలు.. అక్కడి దైవచింతన తన హృదయానికి దగ్గరగా ఉండటం వల్లే ‘ఎల్లమ్మ’ సినిమాకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రివీల్ చేశారు. ఈ చిత్రంలో గ్రామీణ నేపథ్యంతో పాటు దైవిక అంశాలు మిళితమై ఉంటాయని.. తన తండ్రి జ్ఞాపకాలకు.. తన సొంత మూలాలకు ఈ కథ ఒక నివాళిలా నిలుస్తుందని ఎమోషనల్ అయ్యారు.

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సాలిడ్ సబ్జెక్టులో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తుండటమే కాకుండా.. సినిమాకు తనే స్వయంగా సంగీతాన్ని కూడా సమకూరుస్తున్నారు. ఒక విలేజ్ డివోషనల్ డ్రామాకు డీఎస్పీ ఎలాంటి మాస్ అండ్ ఎమోషనల్ ట్యూన్స్ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సంగీత ప్రపంచంలో ఎన్నో రికార్డులను తిరగరాసిన రాక్‌స్టార్.. ఇప్పుడు యాక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వేణు యెల్దండి మార్క్ ఎమోషన్స్.. దిల్ రాజు నిర్మాణ విలువలు.. దేవిశ్రీ ప్రసాద్ స్టార్ పవర్ అన్నీ కలిసి ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్.. మిగతా నటీనటుల వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -