Monday, May 5, 2025
- Advertisement -

విజయవాడ ఇంటర్ విద్యార్ధిని ని చంపింది ఆ ‘పసుపు’ కుర్రాళ్ళే నా ?

- Advertisement -

విజయవాడ పేరు తెలిసిన వారు అందరికీ “స్టెల్లా మేరీ” కాలేజీ తెలీకుండా ఉండదు, ఆ కాలేజీ లో నిన్న ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని

భాను ప్రీతి అనుమానాస్పద రీతి లో మరణించడం ఇప్పుడు విజయవాడ లో లోకల్ గా పెద్ద సంచలనం అయ్యింది.

కాలేజీ హాస్టల్ గది లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటన మీద వివిధ వాదాలు వినపడుతున్నాయి. తల్లితండ్రులు ఒకలాగా చెబుతూ ఉండగా ఆమె కళాశాల యాజమాన్యం మరొక విధంగా మాట్లాడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విజయవాడ ఇంటర్ చదువుకోవడం కోసం వచ్చిన ఆమె కళాశాల లో నిన్న మధ్యాన్నం మెస్ లో భోజనం కూడా చేసి కాసేపటికి ఫ్యాన్ కి ఉరేసుకుని శవం గా కనిపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 

పోలీసుల తనిఖీల్లో అక్కడక్కడా పసుపు పూసిన పేపర్ వారికి కనిపించింది. ఈ పేపర్ లో నలుగురు యువకుల పేర్లతో పాటు వారి సెల్ ఫోన్ నెంబర్లు రాసి ఉన్నాయి. ఆమె మృతికి, పేపర్ లో పేర్లున్న యువకులకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.  ర్యాగింగ్ విషయం లో ఇప్పటికే వివిధ రకాల గొడవల్లో ఉన్న నాగార్జునా యూనివర్సిటీ చెందిన ఈ కాలేజీ లో మళ్ళీ ఈ సంఘటన జరగడం తో ఇక్కడ కూడా ర్యాగింగ్ ప్రబలింది అంటున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -