పవన్ కళ్యాణ్, నాగబాబులు అన్నదమ్ములే కాదు.. మంచి స్నేహితుల్లా కూడా ఉంటారని చాలా మంది చెప్తుంటారు. నాగబాబు ఆరెంజ్ సినిమాని నిర్మించి భారీగా నష్టపోయాడు. ఆ టైంలో నాగబాబుని ఆర్ధికంగా బాగా సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణే. తాను ఆ ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడానికి చాలా శ్రమించానని..అందుకు బుల్లితెర సపోర్ట్ కూడా చాలానే ఉందని నాగాబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
అలానే పవన్ జనసేన పార్టీ గురించి ప్రస్తావిస్తూ.. జనసేనలో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కనిపిస్తుందని.. తాను కూడా పార్టీలోకి రావడాం ఇష్టం ఉన్నా.. ఫైనల్ డెసిషన్ మాత్రం పవన్ దే అని నాగబాబు అన్నారు. తాను పార్టీలోకి వస్తే.. పవన్ కి మేలు జరగకపోయినా పర్వాలేదు కానీ.. ఎలాంటి నష్టం జరగకుడదని నాగబాబు తన ఉద్దేశాన్ని తెలిపాడు. పవన్ తనను పిలిచి పార్టీ కార్యకర్తగా పని చేయమని చెప్పినా పని చేస్తా.. తనకు పదవులు అవసరం లేదని నాగబాబు అన్నారు.
నేణు పడ్డ కష్టం చూశాడు కాబట్టే.. నన్ను పార్టీలోకి పిలవకపోవడానికి కారణం అయ్యి ఉండవచ్చని.. అయితే ఇకపై తాను అంతగా కష్టపడవల్సిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు. ఒక తమ్ముడిగా కంటే కూడా ఒక వ్యక్తిగా.. సమాజం కోసం పరితపించే గొప్ప మనిషిగా పవన్ అంటే నాకు చాలా ఇష్టమని తమ్ముడు మీద ప్రేమని నాగబాబు బయటపెట్టారు. ఇక జనసేన నుంచి కాకినాడ ఎంపీ సీటుకు నాగబాబు పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే.