Thursday, May 8, 2025
- Advertisement -

బాబు గారు సైలెంట్ అయ్యారు

- Advertisement -

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇప్పుడు అచ్చంగా ఇలాగే ఉంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందే పరిస్థితి లేదు. ఇటు.. రాష్ట్రంలో రెవెన్యూ రాబడి కూడా అవసరాలకు తగినంత లేదు.

ఇలాంటి సంకట స్థితిలో.. కేంద్రాన్ని డిమాండ్ చేయలేక.. రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా కంట్రోల్ చేయలేక.. బాబు కాస్త డైలమాలో పడ్డట్టే కనిపిస్తోంది.రీసెంట్ గా.. టీడీపీ, బీజేపీ సంబంధాల్లో కూడా కాస్త తేడాలొచ్చినట్టు కొందరు అనుమానిస్తున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలపడాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కొందరు.. టీడీపీతో బీజేపీ కటీఫ్ చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయని మరికొందరు.. అనుకుంటున్నారు. ఈ ప్రచారంపై దృష్టి పెట్టిన టీడీపీ.. ఇప్పట్లో కేంద్రంతో గొడవ పడేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -