బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు త్వరలో 10వ సీజన్ ప్రారంభంకానుంది. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ ప్రారంభంకాగా తనకు కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం కల్పించాలని ఆయన బిగ్ బాస్ యాజమాన్యాన్ని, స్టార్ మా నిర్వాహకులను కోరారు ఓ ఎస్‌ఐ.
నంద్యాల జిల్లా గడివేముల పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగార్జునరెడ్డి ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో తనకు అవకాశం కల్పించాలని కోరారు.
ఆ వీడియోలో ఎస్ఐ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ…తనకు చిన్నప్పటి నుంచి కళలు, నటన అంటే ఎంతో ఆసక్తి. పోలీస్ శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, నాలో ఒక మంచి కళాకారుడు ఉన్నాడు. బిగ్ బాస్ షోలో పాల్గొని నా సత్తా చాటాలనుకుంటున్నాను. బిగ్ బాస్ టీమ్ నాకు ఒక్క అవకాశం ఇస్తే.. హౌస్‌లో నా ఆటతీరుతో, ప్రవర్తనతో అందరినీ మెప్పిస్తాను అని ఆశాభావం వ్యక్తం చేశారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ల్ అవుతోంది.
సాధారణంగా బిగ్ బాస్ షోలో సెలబ్రిటీలు, సోషల్ మీడియా స్టార్లతో పాటు అప్పుడప్పుడు విభిన్న రంగాలకు చెందిన వారు కూడా కనిపిస్తుంటారు. మరి ఈసారి ఈ నంద్యాల ఎస్ఐ అభ్యర్థనను బిగ్ బాస్ నిర్వాహకులు పరిశీలిస్తారా? ఆయనకు హౌస్‌లోకి ఎంట్రీ దొరుకుతుందా? లేదా అనేది వేచి చూడాలి.
