నిన్నటి దాకా టీడీపీ అభ్యర్థిత్వంపై ఎడతెగని ఉత్కంఠ..! ఇప్పుడు వైసీపీ టికెట్ ఎవరికిస్తారోనని జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఉపఎన్నిక నేపథ్యంలో నంద్యాల రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
శిల్పా చేరికతో వైసీపీ అధినేత జగన్‌కు కొత్త చిక్కొచ్చి పడింది.నిన్నటి వరకు టీడీపీలోఉన్న టికెట్ పోరు ఇప్పుడు వైసీపీలో మొదలయ్యింది.
{loadmodule mod_custom,GA1}
నిన్నటి వరకు టికెట్ నాకే అనకున్న నంద్యాల వైసీపీ ఇన్‌చార్జి రాజగోపాల్‌రెడ్డికి…శిల్పా రాకతో తారుమారయ్యింది.ఇటీవల వైసీపీ ప్లీనరీలోనూ మల్కిరెడ్డే మా అభ్యర్థి అంటూ వైసీపీ నీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా తేల్చేశారు.
ఇప్పుడే జగన్‌కు చిక్కొచ్చి పడింది. గతంలో జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బరిలో దింపి శిల్పా మోహన్ రెడ్డిని బుజ్జగిస్తారా? లేక రాజగోపల్ రెడ్డినే బుజ్జగించి శిల్పా మోహన్ రెడ్డిని నంద్యాల ఉప ఎన్నిక బరిలో నిలుపుతారా? అనేది తాజాగా చర్చనీయాంశమైంది.
{loadmodule mod_custom,GA2}
ఉప ఎన్నికైనా 2019 సాదారన ఎన్నికల్లోనైనా టికెట్ శిల్పాకే నని ఆయన వర్గం వ్యాఖ్యానిస్తుండగా …ఇన్నాల్లూ పార్టీనే నమ్ముకొని ఉన్న రాజగోపాల్‌రెడ్డి పరిస్థితేంటన్నది ప్రశ్నగా మారింది.టీడీపీలో మొదలైన టిక్కెట్ గొడవ అక్కడ సమసి, ఇప్పుడు వైసీపీలో మొదలైందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్.. రాజగోపాల్ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిలలో ఎవరి వైపు మొగ్గు చూపుతారనే విషయం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- ఎన్నిక ఏకగ్రీవ రాయబారానికి తెరలేపిన చంద్రబాబు….?
- శిల్పా చేరికతో వైసీపీలో విబేధాలా…..?
- రసవత్తరంగా మారనున్న నంద్యా ఉప ఎన్నికలు
- నంద్యాల ఉప ఎన్నిక పోరు.. భూమా వర్సెస్ శిల్పా
{youtube}leDgn6OCaYA{/youtube}