Sunday, May 5, 2024
- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక పోరు.. భూమా వ‌ర్సెస్ శిల్పా

- Advertisement -
Nandyal by election

నంద్యాల ఉప ఎన్నిక  ఇప్పుడు రాష్ట్ర‌లో  హాట్ టాపిక్‌గా మారింది. రోజు రోజుకీ రాజ‌కీయ  వాతా వ‌ర‌ణం వేడిఎక్కుతోంది.టికెట్టు కేటాయంపుపై అధినేత నుంచి  బ‌హిరంగంగా ఎటువంటి ప్ర‌క‌ట‌న రాక‌పోయినా మా కుంటుంబంనుంచే అభ్య‌ర్ది పోటీచేస్తార‌ని  అఖిలప్రియ ప్ర‌క‌టించ‌డంతో మ‌రితం వేడెక్కింది వాతావ‌ర‌ణం. ఇప్ప‌టి వ‌ర‌కూ  టికెట్ కోసం భామా ,శిల్పా వ‌ర్గం మ‌ధ్య తీవ్ర‌ పోటీ ఏర్ప‌డింది. చివ‌ర‌కు బాబునుంచి  శిల్పామోహ‌న్ రెడ్డికి చుక్కెదురైంది.దీంతో ఆయ‌న వైసీపీలోకి వెల్లేందుకు అన్ని సిద్దం చేసుకున్నారు.   

అయితే శిల్పా అధికార తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి ప్రతిపక్షమైన వైసీపీలో చేరితే పార్టీ పరువు పోతుందని భావించిన టీడీపీ నాయకత్వం జిల్లా ఇంచార్జీ మంత్రి అచ్చెన్నాయుడును రంగంలోకి దింపింది. దీంతో పార్టీ తరఫున చర్చించేందుకు శిల్పామోహన్ రెడ్డితో  మంత్రి అచ్చెన్నాయుడు భేటీ అయి పలు హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అనంతరం సీన్ రాజధాని అమరావతికి మారింది. మంత్రి అచ్చెన్నాయుడుతో భేటీ అనంతరం శిల్పామోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీకి అమరావతి చేరుకున్నారు.  శిల్ప సోద‌రులు స‌చివాల‌యంలో  బాబును క‌ల‌వాల‌నుకున్నారు. అప్ప‌టికే ప‌లు మీటింగుల‌ల్లో  పాల్గొన్న బాబు అవి ముగించుకొని ఉండవల్లిలోని త‌న నివాసానికి వెళ్లిపోయారు. దీంతో షాక్కు గురవడం శిల్పా సోదరుల వంతు అయింది! ఈ పరిణామంతో శిల్పా బ్రదర్స్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయం పార్టీ నేతలు చెవిన వేయడంతో సచివాలయంలో కలిసే వీలు పడలేదని అందుకే ఇంటికి వచ్చి కలవాల్సిందిగా చంద్రబాబు వారికి సమాచారం పంపారు.

దీంతో చంద్ర‌బాబు నివాసంలో శిల్పా సోద‌రులు భేటీ అయ్యారు. భేటీలో ప‌లు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. 2019 ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, అప్పటికి సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అదే విషయాన్ని శిల్పా మోహన్ రెడ్డికి చెప్పారు. అయితే, నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు పెట్టుకోలేమని, దానిని నమ్ముకోలేమని శిల్పా మోహన్ రెడ్డి అంటున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ఎదుట కూడా కుండబద్దలు కొట్టారని తెలుస్తోంది. టిక్కెట్ తనకు ఇవ్వాల్సిందేనని శిల్పా మోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు. 

భూమాకుంటుంబానికి మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌నీ… నంద్యాల ఎమ్మెల్యే టికెట్‌ను త‌న‌కు కేటాయించాల‌నీ ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు టికెట్టు ద‌క్క‌క‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు క‌ష్టంగా మారుతుంద‌ని త‌ను తీవ్రంగా న‌ష్ట‌పోతాన‌ని…. త‌న రాజ‌కీయ మ‌నుగ‌డ‌కోసం ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీచేయాల్సిందేని  ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. అయితే బాబు నుంచి హామీ రాక‌పోవ‌డంతో ఆశ‌లు వ‌దులుకున్న శిల్పా వైసీపీలోకి చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న‌ట్లు స‌మాచారం.

నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రి నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉందని, దాన్నిబట్టి తాము నిర్ణయం తీసుకుంటామని శిల్పా మోహన్ రెడ్డి అంటున్నారు. అయితే, ఇప్పటికే భూమా అఖిల ప్రియకు చంద్రబాబు టిక్కెట్ ఇస్తామని తేల్చి చెప్పినందున.. శిల్పకు ఆ ఛాన్స్ లేదని, కాబట్టి ఆయన టిడిపిని వీడయం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.

కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ స్థానం ఉప ఎన్నిక టిక్కెట్‌ వ్యవహారం జటిలంగా మారుతున్న విషయం తెలిసిందే. టిక్కెట్‌ తమకే ఇవ్వాలని భూమా, శిల్పా వర్గాలు పట్టుబడుతున్నాయి. తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని అఖిల ప్రకటించకా, తాను పోటీ చేస్తానని శిల్పా చెప్పారు. మ‌రి  ఈ ఉప ఎన్నిక శాల్పా వ‌ర్సెస్ భూమా కుంటుం మ‌ధ్యే జ‌రుగుతుంద‌న‌డంలో సందేహంలేదు.

Related

  1. బాలయ్య పరువు తీసిన జనం.. దున్నపోతుతో ఊరేగిస్తూ దారుణంగా
  2. ట్రంప్ కొత్త ఆర్డ‌ర్‌పై క‌సంత‌కం దేశీయ ఐటి సంస్థ‌ల‌పై పెనుభారం
  3. ఇక మార‌వ లోకేష్‌ నీకు దండంపెడ‌తర‌ కొడుకో
  4. బాబ్రీ మ‌సీదు విధ్వంస కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేడే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -