అనేక రకల నిత్యవసరాలను అందించే సంస్థ హెరిటేజ్. 1992లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీలో దీనిని స్థాపించారు. చిన్న సంస్థగా మొదలు అయిన ఈ సంస్థ.. పెద్దది అవ్వడానికి చాలా సమయం పట్టింది. ప్రస్తుతం 25వ సంవత్సరంలోకి ప్రవేశించి రజతోత్సవం జరుపుకొంటోంది.
ప్రస్తుతం ఈ కంపెనీ ఏటా రూ.2642 కోట్ల టర్నోవర్‌తో వివిధ దేశాల్లోఅనేక ఔట్‌లెట్లను స్థాపిస్తోంది. అయితే ఈ సంస్థకు ముందు నుంచి ఈ వెలుగు లేదు. చంద్రబాబు కోడలు బ్రాహ్మణి అడుగు పెట్టాక.. ఆమె ఈ కంపెనీని తన చేతుల్లోకి తీసుకుని పాలన ప్రారంభించాక కంపెనీ ఓ రేంజ్ లో అభివృద్ధి చెందింది. కేవలం ఏపీకే పరిమితమైన వ్యాపారాన్ని కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిసా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, యూపీ, గుజరాత్ సహా దేశంలోని అనేక ప్రాంతాలకు కంపెనీ ఉత్పత్తులను విస్తరించారు. ఇక పబ్లిక్‌రంగ సంస్థగా ముందుకు పరుగులు పెట్టించడంలో బ్రహ్మిణి కీలక పాత్ర ఫోషించారు. అధునాతన సాంకేతిక వ్యవస్థతో కంపెనీలో తాజా సరుకుల నిల్వ, పాల ఉత్పత్తుల పెంపుదల వంటివాటిపై దృష్టి పెట్టారు.
సాధ్యమైనంత ఎక్కువ సరుకులను.. తక్కువ ధరకే ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా.. ఈ సంస్థను చూసి.. వామ్మో అనుకున్నవాళ్లు.. ఇప్పుడు దీనిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇదే విషయాన్ని రజతోత్సవం సందర్భంగా హెరిటేజ్ డైరెక్టర్‌గా ఉన్న సీఎం సతీమణి నారా భువనేశ్వరి వెల్లడించారు. ఏది ఏమైన బ్రాహ్మణి కృషితో హెరిటేజ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. ఎప్పటికి చిన్న సంస్థగానే ఉంటదేమో అని భయపడిన చంద్రబాబుకు ఆయన కోడలు కంపెనీని అభివృద్ధి చేసి.. పెద్ద షాక్ ఇచ్చింది.