మంత్రి నారా లోకేశ్‌కు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఆయన అసెంబ్లీ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళగిరి టికెట్ తనకు కేటాయించిన దగ్గర నుంచి అక్కడే తిష్టవేసి మరి ప్రచారం చేస్తున్నారు. స్థానిక నేతలతో కలిసి రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి లోకేశ్ నిడమర్రులో ప్రచారం నిర్వహించారు.
ఆ గ్రామంలోని సద్గుణ టిఫిన్ సెంటర్ ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగాహోటల్ నేమ్ బోర్డు కూలిపోయింది.లోకేశ్ సహా మిగిలిన నేతలంతా దానికి దూరంగా ఉండటంతో అది కార్యకర్తల మీద పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇలా ఉంటే నారా లోకేశ్ ప్రచారానికి ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఆయన ప్రచారం చేస్తుంటే పెద్దగా జనాలు కూడా హాజరుకాకపోవడం విశేషం.
- Advertisement -
నారా లోకేశ్‌కు తృటిలో తప్పిన పెనుప్రమాదం
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -