Wednesday, May 1, 2024
- Advertisement -

హాట్ హీరోయిన్ నయనతార.. యంగ్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకుందట.. ఏవరా డైరెక్టర్..?

- Advertisement -

నయనతార.. ఈమె ఇప్పుడు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈమె ఏ సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ హిట్. తన అదృష్టమో.. లేక సినిమా అదృష్టమో తెలియదు కానీ ప్రస్తుతం నయనతార ఏం సినిమా చేస్తే.. ఆ సినిమా పక్కా హిట్. జీవితంలో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నా కూడా స్ట్రాంగ్ గా నిలబడింది.

లైఫ్ లో ఎన్ని రాంగ్ రూట్స్ లో వెళ్లినా మళ్లీ యూ టర్న్ తీసుకోవడం ఈమెకు అలవాటే. అందుకే ఎక్కువగా మీడియా ముందుకు రాదు. ఆమె తెలివో లేక అదృష్టమే తెలియదు గాని కెరీర్ ని మాత్రం ఇప్పటివరకు ఒక లెవెల్ లో సెట్ చేసుకుంటూ వస్తోంది. నయన సినీ లైఫ్ ఒకే గాని పర్సనల్ లైఫ్ ని మాత్రం జవాబు దొరకని ప్రశ్నగా మార్చుకుంటోంది. అసలు విషయంలోకి వెళ్తే.. నయనతార ఈ మధ్య పెళ్లి చేసుకుందనే న్యూస్ బానే వినిపిస్తోంది. శింబు, ప్రభు దేవా వంటి స్టార్స్ తో ప్రేమయణాన్ని నడిపిన ఈ భామ అవి విఫలం అయిన తర్వాత.. యంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో చాలా సన్నిహితంగా ఉంటుంది. అతని పుట్టిన రోజు వేడుకలను ఆమెరికాలో ఘనంగా చేసి అతనికి మర్చిఫోలేని సంతోషన్ని ఇచ్చింది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా విగ్నేష్ అప్పుడే చెప్పాడు. అయితే తాజాగా వారిద్దరూ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకోనున్నారని కోలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా చెన్నై లో ఒక విల్లాను కూడా కొనేసి పెళ్లి తర్వాత అందులో ఉంటున్నారని పుకార్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని వారిద్దరి మధ్య లవ్ మాత్రం ఓ స్థాయిలో కొనసాగుతుందని కోలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -