Monday, May 13, 2024
- Advertisement -

అక్కడ పరిస్థితి దారుణం.. ఒక్కరోజులో 4500 మంది మృతి..!

- Advertisement -

అమెరికాను కరోనా వైరస్ అన్ని దేశాలకంటే ఎక్కువ భయపెడుతోంది. ఇక్కడ వేలాది మంది ప్రాణాలు పోతున్నాయి. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అమెరికాలో మొత్తం 32,917 మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారట. గత 24 గంటల్లో ఏకంగా 4,491 మంది మృతి చెందారంటే అమెరికాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.

ఇక ఒక రోజులో ఇంతమంది ప్రాణాలు పోవడం అమెరికాలో ఇదే మొదటిసారి. ఇందులో గతంలో చేర్చని కోవిడ్-19కు సంబంధించిన సంభావ్య మరణాలు కూడా ఉన్నాయి. కాగా, మొత్తం మరణాల్లో 3,778 సంభావ్య మరణాలను చేర్చినట్టు న్యూయార్క్ నగరం ప్రకటించింది. గురువారం రాత్రి నాటికి ‘యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ 31,071 మరణాలను నమోదు చేసింది. ఇందులో 4,141 సంభావ్య మరణాలు ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు అమెరికాలోనే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఇటలీ ఉంది. ఇక్కడ ఇప్పటివరకు 22,170 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 19,130 మంది, ఫ్రాన్స్‌లో 17,920 మంది చనిపోయారు. అమెరికాలో మొత్తంగా 6,67,800 కరోనా కేసులు నమోదకాగా.. ఈ రెండు రోజుల్లోనే ఇక్కడ రికార్డు స్థాయిలో మరణాలు ఉన్నాయి. ఎపిక్ సెంటర్‌గా మారిన న్యూయార్క్‌లోనే 12 వేల మందికిపైగా మరణించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -