Wednesday, May 7, 2025
- Advertisement -

వీడిన కూకట్ పల్లి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య మిస్టరీ….

- Advertisement -

కూకట్ పల్లిలో జరిగిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సతీష్ దారుణ హత్య కేసులో కొత్త కోనం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. హత్యకు కారణం ప్రియాంక అనే యువతి అని పోలీసులకు నిర్ధారణకు వచ్చారు. సతీష్‌ స్నేహితుడైన హేమంతే హత్య చేసినట్టుగా తెలుస్తోంది. పథకం ప్రకారమే సతీష్‌ ను అతని స్నేహితుడు హేమంత్‌ హత్యచేసినట్టు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

పోలీసులు లోతుగా విచారణ చేయడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. సతీష్, హేమంత్ లు ఫ్రెండ్స్. ఇద్దరూ కలసి సాప్ట్ వేర్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం సతీష్ కు ప్రియాంక అనే యువతి పరిచయం అయ్యింది. అది కాస్త ఇద్దరి మధ్య చనువు పెరగడంతోతన కంపెనీలో ప్రియాంకకు ఉద్యోగం ఇచ్చారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య సంబంధాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సతీష్ తన ఫ్రెండ్ హేమంత్ ను ప్రియాంకాకు పరిచయం చేశాడు. భార్యకు దూరంగా ఉంటున్న హేమంత్ కూడా ప్రియాంకతో ఎఫైర్ కొనసాగించాడు. ప్రియాంక ఒకరికి తెలియకుండా ఒకరితో స్నేహితులిద్దరితో వ్యవహారం నడిపిస్తోంది.

ఈ విషయం ఇద్దరికి తెలియడంతో వారి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో ఫ్రియాంకకు దూరంగా ఉండాలని ఒకరి నొకరు హెచ్చరించకున్నట్లు తెలుస్తోంది. సతీస్ ను అడ్డు తొలగించుకుంటె ప్రియాంకతో కలసి ఉండవచ్చనే దురుద్దేశ్యంతో హేమంత్ సతీష్ హత్యకు పక్కా ప్లాన్ వేశారు. మాట్లాడుకుందామని ఇంటికి రప్పించి సతీష్ ను అతి కిరాతకంగా హత్య చేశారు. అదే సమయంలో అక్కడ మహిల ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. ఘటన జరిగినప్పటినుంచి హేమంత్ పరారీలో ఉన్నారు. సెల్ ఫోన్ కూడా స్విచ్ఛాప్ చేయడంతో అతడి ఆచూకి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. అయితే హత్యకు ఆర్ధిక సంబంధాలే కారణమా, లేక ఈ యువతి కారణమా అనే తేల్చే పనిలో పడ్డారు పోలీసులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -