- Advertisement -
తెలంగాణలో వెనుబడిన వర్గాల సంక్షేమం కోసం త్వరలో బిసి సబ్ ప్లాన్ ను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనిని వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలనుకుంటున్నారు. తెలంగాణలో బిసీలకు సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయడం లేదన్న వాదనలు వినిపిస్తున్న క్రమంలో బిసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించారు.
గురువారం నాడు తెలంగాణ శాసనసభ బిసి వెల్ఫైర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో బిసి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. బిసిలకు అమలు చేసే వివిధ పథకాల్లో పారదర్శకత లోపించిందని, ఇక నుంచి దానిపై ద్రష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలెో మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, కమిటీ సభ్యులు విఠల్ రెడ్డి, పుట్టా మధుకర్, చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.