Thursday, May 8, 2025
- Advertisement -

ప్రభుత్వం వేగంగా స్పందించింది!

- Advertisement -

20 రోజులుగా విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం సెజ్ బ్రాండెక్స్ కార్మికుల ఆందోళనతో అట్టుడుకుతోంది. కనీస వేతనాలు, పీఎఫ్ బకాయిల విడుదల కోసం కంపెనీ కార్మికులు గత నెల 15న మొదలుపెట్టిన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. వేలాది మంది కార్మికులు విడతల వారీగా చేస్తున్న ఆందోళనలతో సెజ్ మొత్తం నిరసనలతో హోరెత్తుతోంది.

ఆందోళనలు మొదలైన సందర్భంగా రంగంలోకి దిగిన టీడీపీ సీనియర్ నేత, కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీలంకకు చెందిన సదరు కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. వారంలోగా సమస్యను పరిష్కరిస్తామని యాజమాన్యం మంత్రితో పాటు కార్మికులకూ హామీ ఇచ్చింది. ఆ తర్వాత మాట తప్పింది. ఏపీ ప్రభుత్వమూ పట్టించుకోవడం మానేసింది.

ఈ క్రమంలో కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు కొద్దిసేపటి క్రితం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాదు నుంచి విమానంలో విశాఖ బయలుదేరారు. బ్రాండెక్స్ కార్మికుల వద్దకు జగన్ బయలుదేరారని తెలుసుకున్న ప్రభుత్వం వేగంగా స్పందించింది. జగన్ విశాఖలో కాలుమోపక ముందే… బ్రాండెక్స్ లో కనీస వేతనాల అమలు కోసం ఓ ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -