ప్రభావం చూపించేది ఉన్నా లేకపోయినా సమయానికి తగ్గట్టు చెయ్యాల్సిన పనులు రాజకీయాల్లో చెయ్యాలి లేదంటే వేరే వైపు బ్యాలన్స్ తప్పుతుంది. అధికార పక్షానికి పూర్తి బలం ఉన్నా కూడా బాబు సర్కారు మీద తమ సొంత లాభం కోసం జగన్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్దం అయ్యింది.
బాబు సర్కారు మీద ఏపీ లో ప్రజానీకం తీవ్ర అసంతృప్తి తో ఉంది అనీ అందుకే తాము ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టాలనే నిర్ణయానికి ఒచ్చాం అనీ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ కు అందచేశారు.
ఈ విషయాన్న జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు వెల్లడించారు. తామిచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఈ సమావేశాల్లోనే చర్చకు అనుమతించాల్సిందిగా జగన్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. మరి.. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.