పెళ్లి అంటే.. మాములుగా ఉండకుడదు.. అంగరంగ వైభవంగా చేయాలి అని ఆలోచిస్తుంటారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలల్లో ఎవ్వరు కూడా కనీ వినీ ఎరుగని స్థాయిలో ఓ పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి శుభలేక ముఖ్యమైన వ్యక్తులకి ఇవ్వడం కోసం ఒక్కో శుభలేఖ కి లక్షన్నర ఖర్చు చేస్తున్నారట.
సుమారు 300 మందికి పంచనున్నారట. వీటితో పాటు పట్టుచీర, పట్టుపంచె, చిన్న వెండి గిన్నె, బంగారం తో చేసిన వస్తువులు కలిపి ఇవ్వనున్నారట. ఈ కార్డులు మాత్రం వివిఐపి లకి మాత్రమేనట.ఇంకా మామూలు వారికోసం కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారట. ఇంతకీ ఇంత భారీ స్థాయిలో జరుగుతున్న పెళ్లి ఎవరిదంటే ఎన్ టివీ చౌదరి కుమార్తె ది. తన కూతురి కోసం ఒక వ్యాపారవేత్త కుటుంభానికి చెందిన అబ్బాయి ని పెళ్ళికొడుకు గా ఎంపిక చేశారట. అల్లుడి కి పెళ్లి కానుకగా సుమారు 50 కోట్ల విలువైన చిన్న విమానం కానుకగా ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియక పోయినా. నిజంగా ఇదే జరిగితే విమానం కానుకగా ఇచ్చే పెళ్ళి మన రాష్ట్రాలలో ఇదే మొదటిది అవుతుంది.ఈ పెళ్ళికి దేశం నలుమూలల నుంచీ ప్రముఖులు ,రాజకీయ నాయకులు హాజరుఅవుతారట. ఇంతమంది ఒకే సారి హైదరాబాద్ లో అడుగు పెడితే ట్రాఫిక్ ఎమవ్వాలి అని ఆలోచించిన చౌదరి గారు.పెళ్లిని శంషాబాద్ లో ప్లాన్ చేశారట.