Thursday, May 2, 2024
- Advertisement -

రోడ్డు ప్రమాదంలో హీరోకు గాయాలు… ఓ మహిళ దుర్మరణం!

- Advertisement -

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. రోడ్డు ప్రయాణంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉన్నది. గుంటూరు జిల్లా చినకాకాని హైవైపై రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఈరోజు వేగంగా వెళుతున్న ఓ కారు.. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే చనిపోగా, కారు అదుపుతప్పి డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన సుధాకర్‌కు గాయాల‌య్యాయి.హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సుధాకర్, నువ్వు తోపురా సినిమాలో హీరోగా చేస్తున్నాడు.ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను సుధాకర్‌ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కేడే మృతి చెందగా, కారులో ఉన్న నటుడు సుధాకర్‌ గాయపడ్డారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -