Tuesday, April 30, 2024
- Advertisement -

ఆ షాపు లోకి ముస్లిం లని రానివ్వరు

- Advertisement -
obama and muslims prohibited entry into that american store

ముస్లిం ల విషయం లో అమెరికా లో ఒక దురహంకార షాపు యజమాని మళ్ళీ తన పొగరు చూపించాడు. అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో ఒక షాప్ లో ముస్లిం లు ఆ దేశ అద్యక్షుడు ఒబామా కి కూడా ప్రవేశం లేదు అంటూ ఫోటో పెట్టేసాడు. ముస్లిం ల వ్యతిరేక నినాదాల గుర్తులతో ఉండే ఈ షాపులో ఇంతవరకూ ఇలాంటి బోర్డు ఉంది అని ఎవ్వరికీ తెలీదు.

ఇన్నేళ్లుగా ఉన్న ఈ షాప్ తాలుకు చిత్రాన్ని తాజాగా ఓ పర్యాటకుడు వీటిని చూసి ఓ టీవీ చానెల్ కు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ టీవీ చానెల్ వారు షాపులో పనిచేసిన మాజీ ఉద్యోగి  మార్లన్ మెక్ విలియమ్స్ ను  ఇంటర్వ్యూ చేశారు. ఎవరు ఓనర్ చర్యను విమర్శించినా వారిని వెంటనే బయటకు గెంటేసేవారని ఆ ఉద్యోగి తెలిపాడు. అలా చాలా మందిని మళ్లీ రాకుండా చేశాడని చెప్పాడు. ఒబామాతోపాటు ఇతర సెలబ్రిటీలపై కొన్ని గుర్తులు తయారుచేసి వాటిని కస్టమర్లకు అమ్మేవాడని అతను అన్నాడు.

అందులో ఒకటి ఒబామా కేర్ కు వ్యతిరేకంగా రాసింది. కిల్ ఒబామా కేర్ అని చెప్పాలనుకున్న ఆ ఓనర్.. కిల్ ఒబామా అంటూ పెద్దగా రాసి కేర్ అని చిన్న అక్షరాలతో సరిపెట్టాడని మెక్ విలియమ్స్ చెప్పాడు. ఆ ఓనర్ తీరుపై చాలా మంది విమర్శలు గుప్పిస్తుండగా.. మరికొందరు మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఎవరి అభిప్రాయాలు వాళ్లు వ్యక్తంచేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ స్టోర్ ను ఓనర్ అమ్మకానికి పెట్టాడు. ఈ వివాదాస్పద గుర్తులపై స్పందించడానికి అతను నిరాకరించాడు. ద కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ ఓనర్ కు ఓ లేఖ కూడా రాసింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఓకే అయినా.. దేశ సమగ్రత కోసం ఇలాంటి వాటిని తొలగించాలని కోరింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -