Saturday, May 10, 2025
- Advertisement -

మోడీ దెబ్బకు జగన్ పాలన మూడున్నరేళ్లేనా?

- Advertisement -

ఇప్పుడు దేశంలో మోడీ వన్ మ్యాన్ ఆర్మీ. ఓ రకంగా చెప్పాలంటే నియంతే. ఆయన చెప్పిందే మాట.. వేసిందే శాసనం. అందుకే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను కబళించేందుకు జాతీయవాదాన్ని దేశవ్యాప్తం చేసేందుకు ఒకే దేశం-ఒకే ఎన్నికలు అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు.

ఇప్పుడు ఈ ఐడియాను ఎదురించే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. అయితే మోడీ జమిలీ దెబ్బకు ఏపీలో ఎన్నో రోజుల తర్వాత కలలు గని అధికారంలోకి వచ్చిన జగన్ కలలు కల్లలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయట..

వచ్చే ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని బాగా పాలించి.. టీడీపీని తుత్తునియలు చేయడానికి ఇప్పటికే జగన్ స్కెచ్ గీశారు.కానీ జగన్ పరిపాలన ముచ్చట తీరకుండానే వచ్చే మూడున్నరేళ్లకే ముగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

2024లో ఐదేళ్లకు ఏపీలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ మోడీ జమిలి ఎన్నికల ప్రతిపాదన పుణ్యమాని మూడున్నరేళ్లకే ఏపీ అసెంబ్లీరద్దు అయ్యి మళ్లీ దేశవ్యాప్తంగా జమిలీతో ఏపీలో ఎన్నికలు రానున్నాయి. దీంతో ఏపీలో ఐదేళ్లు పాలించే అనుభూతిని జగన్ అనుభవించకుండా పాలనను ముగించాల్సి రావడంతో కొంత ఇబ్బందికర పరిస్తితి ఎదురవుతోంది.

దీంతో జగన్ ఇచ్చిన నవరత్నాలు, గొప్ప హామీలను మూడున్నరేళ్లలో పూర్తి చేయడం.. ప్రజలను సంతృప్తిపరడం కత్తిమీద సామే.. ఒకవేళా తేడాకొడితే మొదటికే మోసం.. సో ఇప్పటికైనా జగన్ ఇలానే దూకుడుగా ముందుకెళ్లి మూడున్నరేల్లకే ప్రజందరికీ సంక్షేమ పథకాలను అందించాల్సి ఉంటుంది. లేకుంటే పరిస్థితి వేరేలా ఉండే ప్రమాదం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -