- Advertisement -
సీఎన్జీ కలిగిన ఆటోలో వెల్తున్నారా…..! జాగ్రత్త. ఎందుకంటె అవి కూడా పేలిపోతున్నాయి. తాజాగా కర్నూలు లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోలోని సీఎన్జీ గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు పేలాయా? లేక ఆటోలో ఏర్పాటు చేసిన సీఎన్‌జీ సిలిండర్ పేలింది తెలియాల్సి ఉంది.
ఎండ వేడిమే సిలిండర్ పేలుడుకు గల కారణంగా సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కర్నూలు నుంచి కల్లూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
