Thursday, May 8, 2025
- Advertisement -

హైద‌రాబాద్‌లో వెలుగులోకి ఆన్‌లైన్ డేటింగ్ స్కామ్‌…

- Advertisement -

ఈ మద్య టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది సైబర్ మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎదుటి వ్యక్తి ఎవరు అని చూడకుండా ఆన్ లైన్ లో తమ జాతకం మొత్తం చెప్పడంతో ఈజీగా మోసం చేస్తున్నారు సైబర్ మోసగాళ్లు. హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘరానా మోసం ప్రకంపనలు సృష్టిస్తోంది.

హీరోయిన్ల పేరుతో ఫేక్ కాల్స్ చేయిస్తూ డేటింగ్ పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఒక్కో వ్యక్తి దగ్గర రూ. 10,000 నుంచి రూ. 15 వేల వరకూ వసూలు చేశారు. రూ. 15 లక్షలు కోల్పోయిన ఓ బాధితుడి ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

బాధితుల్లో 150 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్ లో ఆన్ లైన్ డేటింగ్ పేరు తో మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. అందమైన అమ్మాయిలు, కొంత మంది హీరోయిన్ల ఫోటోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ఈ మోసానికి పాల్పడినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

తాము ఇంత ఘోరంగా మోసపోయామని తెలిస్తే సమాజంలో సిగ్గు పోతుందని చాలా మంది బాధితులు సైలెంట్ గా ఉండి పోవడం కూడా ఈ కేటుగాళ్లకు బాగా కలిసి వచ్చింది. బాధితుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ఆయన వెల్లడించారు. ఈ ముఠా గుట్టురట్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులను ఆయన అభినందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -