Monday, May 5, 2025
- Advertisement -

85మందికి ప‌ద్మ పుర‌స్కారాలు

- Advertisement -

తెలుగు రాష్ట్రాల నుంచి ఒక‌రికే

భార‌త‌దేశంలో భార‌త‌ర‌త్న త‌ర్వాత అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అవార్డులు, పుర‌స్కారాలు ప‌ద్మ‌. ప‌ద్మ విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ మూడు అవార్డులు త్రిర‌త్నాలుగా భావిస్తారు. ఈ అవార్డులు రావ‌డం కొంద‌రి జీవిత క‌ళ‌. ఈ అవార్డుల‌ను భార‌త ప్ర‌భుత్వం గ‌ణ‌తంత్ర దినోత్స‌వం (జ‌న‌వ‌రి 26) సంద‌ర్భంగా 25వ తేదీన ప్ర‌క‌టిస్తుంది. 2018 సంవ‌త్స‌రానికి కేంద్ర ప్ర‌భుత్వం 85 మందికి ప‌ద్మ పుర‌స్కారాల‌కు ఎంపిక చేసింది. ఈ అవార్డుల‌ను గురువారం (జ‌న‌వ‌రి 25)న ప్ర‌క‌టించింది. మొత్తం 15,700 మంది ఈ అవార్డుల‌కు దరఖాస్తు చేసుకోగా కేంద్ర ప్ర‌భుత్వం క్షుణ్నంగా ప‌రిశీలించి చివ‌రికి 85మందికి ప్ర‌క‌టించింది.

ఈ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క‌రికి మాత్ర‌మే అవ‌కాశం వ‌చ్చింది. స్పోర్ట్స్ కోటాలో కిదంబి శ్రీకాంత్‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డు ద‌క్కింది. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పుర‌స్కారం ద‌క్క‌లేదు.

గణతంత్ర దినోత్సవం సంద‌ర్భంగా ఈ ఏడాది విద్య, వైద్యం, కళలు, సామాజిక సేవ, సాహిత్యం తదితర రంగాల్లో విశేష కృషిచేసిన ప్రముఖులకు ఏటా ప‌ద్మ‌ పురస్కారాలను ప్రకటిస్తారు. వారిని సేవ‌ల‌ను గౌరవించుకోవడానికి ఈ సంప్ర‌దాయం తీసుకొచ్చారు. ఈ అవార్డుల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, గులాం ముస్తఫాఖాన్‌తో పాటు సాహిత్యం, విద్యారంగానికి చెందిన పరమేశ్వరన్‌ (కేరళ)ను కేంద్రం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనికి పద్మభూషణ్‌ ప్రకటించింది. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, తెలుగు వాడు కిదాంబి శ్రీకాంత్‌కు పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -