Monday, May 12, 2025
- Advertisement -

పుర్రెకు చికిత్స‌తో పున‌ర్జ‌న్మ‌: అద్భుతం.. స‌ర్కార్ ద‌వాఖానా ప‌నితీరు..

- Advertisement -

స‌ర్కార్ ద‌వాఖానాల‌కు పున‌ర్జీవం నింప‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా స‌ర్కార్ ద‌వాఖానాల‌కు పెద్ద ఎత్తున నిధులు విడుద‌ల చేస్తూ ఆస్ప‌త్రుల అభివృద్ధికి విశేష కృషి చేస్తోంది. ఒక‌ప్పుడు ‘‘నేను బోను స‌ర్కార్ ద‌వాఖానాకు బిడ్డ అనేటోళ్లు ఇప్పుడు స‌ర్కార్ ద‌వాఖానాకు పోదాం ప‌ద అని’’ ప్ర‌జ‌లు అంటున్నారు. ఇప్పుడు ఈ వార్త వింటే మీరు కూడా స‌ర్కార్ ద‌వాఖానాకు పోతా అంటారు. ఎందుకో చ‌ద‌వండి..

హైద‌రాబాద్‌లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద ఆస్ప‌త్రి ఉస్మానియా ద‌వాఖానా. ఈ ఆస్పత్రిలో న‌యం కానీ వ్యాధి అంటూ ఏది ఉండ‌దు. అన్నింటికీ ఇక్క‌డ చికిత్స ల‌భిస్తుంది. ఈ ఆస్ప‌త్రిలో బుధ‌వారం వైద్యులు అరుదైన శ‌స్త్ర‌చికిత్స చేసి ఓ వ్య‌క్తికి ప్రాణం పోశారు. ఆ వివ‌రాలు..

రాజు అనే 30 ఏళ్ల యువకుడు మూడు వారాల కింద‌ట విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్ర‌మాదంలో రాజు శరీరం, తల, చెవి వద్ద తీవ్ర గాయాలయ్యాయి. తల నుంచి చెవి వద్ద వరకు రక్తనాళాలు దెబ్బతిన్నాయి. తలపై చర్మం కాలిపోవడం కపాలం (పుర్రె) తేలింది.

చికిత్స కోసం పెద్ద పెద్ద ప్రైవేటు ఆస్పత్రుల‌ను సంప్ర‌దించినా కపాలంపై కాలిన చర్మాన్ని సరిచేయలేకపోయారు. చివరకు ఉస్మానియా ఆస్పత్రిలో చూపించుకున్నాడు. ఆస్పత్రి ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం యూనిట్‌ అధిపతి ప్రొఫెసర్‌ లక్ష్మి రాజును పరిశీలించారు. ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా క‌పాలం సరి చేయవచ్చునని నిర్ణయించి చికిత్స‌కు సిద్ధ‌మ‌య్యారు.

చికిత్స ఇలా:
బుధవారం (ఏప్రిల్ 4) ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 8 నుంచి 10 గంటల పాటు ప్లాస్టిక్‌ సర్జరీ చేశారు.రు. రాజు తొడపై ఉన్న చర్మంతో పాటు అక్కడ ఉన్న రక్తనాళాలను తీసి.. వాటిని కపాలంపై అమర్చారు. కపాలం నుంచి రక్తనాళాలను చెవి వద్ద ఉన్న ఇతర రక్తనాళాలకు అనుసంధానం చేశారు. దీంతో రాజు పూర్వ స్థితికి చేరుకున్నాడని డాక్టర్‌ లక్ష్మి వివరించారు. ఈ సర్జరీని ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పూర్తిగా ఉచితంగా నిర్వహించడం విశేషం. సర్జరీ విజయవంతం కావడంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కోదండపాణి, సర్జరీలో వైద్యులు రాజ్‌కిరణ్‌కుమార్‌ గౌడ్‌, బలీరాం, కల్పన, తనుజా, పాండునాయక్‌, వెంకటేశ్వర్లు హ‌ర్షం వ్య‌క్తం చేశా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -