Saturday, May 4, 2024
- Advertisement -

పాక్ పీఎమ్ఓలో భారీ అగ్ని ప్రమాదం….. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు తప్పిన పెను ప్రమాదం

- Advertisement -

పాక్ పీఎమ్ ఓ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రధాని ఆఫీసులోని ఆరో అంతస్తులో ఈరోజు ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు చెలరేగిన సమయంలో…ఐదో అంతస్తులో అధికారులతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమావేశంలో ఉన్నారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ ను భద్రతాధికారులు హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు. అగ్నిప్రమాదం సమచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.

ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు స్పందిస్తూ.. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఈ అగ్నిప్రమాదం చెలరేగడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాదం వార్త తెలియగానే.. సిబ్బందిని సురక్షితంగా బయటికి పంపించాలని ఇమ్రాన్‌ ఆదేశాలు జారీ చేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -