ఫ్యాక్షన్ గొడవలు పేరు చెప్తే వెంటనే పరిటాల రవి గుర్తుకు వస్తాడు. ఆయన బతికి ఉన్న రోజుల్లో అనంతపురం రాజకీయాలని శాసించారు. ఇప్పటికీ అక్కడ ఉండే రైతులు ఆయన్ని దైవంగా పూజిస్తారు అంటే ఎంతగా ఆయన ప్రభావం ఆ జిల్లాల్లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
ఆయన వారసత్వం ఇప్పుడు ఫాక్షన్ లో కాకుండా రాజకీయంగా నడుస్తోంది. ఒకవైపు టీడీపీ మినిస్టర్ గా ఆయన భార్య సునీత ప్రజా జీవితం లో ఉండగా. పరిటాల ఆశయం సాధ్యం చెయ్యడం కోసం అతని వారసుడు పరిటాల శ్రీరాం బరిలోకి దిగబోతున్నాడు. 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు పరిటాల శ్రీరామ్ ఇప్పటినుంచే అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజోపయోగ కార్యక్రమాల్లో తలమునకలుగా ఉంటున్నారు.
ముఖ్యంగా పెన్నానదిపై పేరూర్ డ్యామ్‌ని నిర్మించి 10వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు కంకణం కట్టుకున్నారు శ్రీరామ్. అందుకోసం బోలెడంత కృషి చేస్తున్నారు. రైతుల కళ్లలో ఆనందం చూసేందుకు ఇటీవలి కాలంలో జీడిపల్లి రిజర్వాయర్ కెనాల్ ఏర్పాటు కోసం తల్లి సునీతతో కలిసి ఎంతో శ్రమించారు. ఇప్పుడు ఏకంగా పేరూరు డ్యామ్ కోసం సీఎం చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయల నిధుల్ని ప్రకటించేలా చేయగలిగారు.