Monday, May 6, 2024
- Advertisement -

బ్రెజిల్‌లో చిలుక‌ను అరెస్ట్ చేసిన పోలీసులు…

- Advertisement -

స్మ‌గ్లింగ్ చేస్తున్న చేస్తున్న దొంగ‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం. కాని బ్రెజిల్ పోలీసులు మాత్రం చిలుక‌ను అరెస్ట్ చేశారు. చిలుక‌ను అరెస్ట్ చేయ‌డం ఏంట‌నుకుంటున్నారా…? మీరు వింటున్న‌ది నిజ‌మే. ఆచిలుక మామూలు చిల‌క కాదు. స్మ‌గ్ల‌ర్ల‌కు స‌హాయం చేయ‌డంలో త‌న తెలివి తేట‌ల‌ను చూపించి చివ‌ర‌కు ఆరెస్ట్ అయ్యింది.బ్రెజిల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి తెలుసుకోవల్సిందే.

అక్కడ స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న పోలీసులకు.. నిందితులు ఓ ఇంట్లో పెద్ద ఎత్తున కొకైన్‌ను సరఫరా చేస్తున్నారన్న సమాచారం అందింది. దీంతో పోలీసులు స్మ‌గ్ల‌ర్ల కోసం అక్క‌డి చేరుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్న స్మగ్లర్లకు మాత్రం ఈ విషయం తెలియదు. కానీ.. గుమ్మం వద్ద పంజరంలో ఉన్న చిలుక బలగాల రాకను పసిగట్టింది. వెంటనే ‘మమ్మా.. పోలీస్’ అని అరిచింది. దీంతో అప్రమత్తమైన స్మగ్లర్లు మరో మార్గం ద్వారా అక్కడి నుంచి పారిపోయారు.

దీంతో అది నేరగాళ్లకు సమాచారం అందిస్తుందనే కారణంతో చిలుకను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆ చిలుకకు నేరగాళ్లు శిక్షణ ఇచ్చి ఉంటారని అక్క‌డి పోలీసుల అధికారులు పేర్కొన్నారు.ఈ చిలుకను పరీక్షించిన వెటర్నరీ డాక్టర్ స్పందిస్తూ.. పోలీసుల ప్రశ్నలకు చిలుక స్పందించడం లేదన్నారు. దీంతో దాన్ని వదిలిపెట్టాలంటూ పర్యావరణ, పక్షి ప్రేమికులు నుంచి డిమాండ్లు రావడంతో చేసేదిలేక స్థానిక జంతుప్రదర్శనశాలకు అప్పగించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -